Leading News Portal in Telugu

I Will Take As Home Minister Post: Pawan Kalyan


  • నేను హోంమంత్రిని అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి..

  • విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే.. హోంమంత్రిగా నేను బాధ్యతలు తీసుకుంటాను..

  • లా అండ్ ఆర్డర్ చాలా కీలకం.. పోలీసులు మర్చిపోకండి: డిప్యూటీ సీఎం పవన్
AP Deputy CM: నేను హోంమంత్రిని అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి..

AP Deputy CM: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని చెప్పుకొచ్చారు. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రిగా నేను బాద్యతలు తీసుకుంటాను అని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా హోం మంత్రి వంగలపూడి అనిత రివ్యూ చేయాలి అని ఆయన కోరారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకం. .పోలీసులు మర్చిపోకండి అని తెలిపారు. మా బంధువు అంటే మడత పెట్టి కొట్టండి.. ఆడ పిల్లలు రేప్ చేస్తే కులం ఎందుకు వస్తుంది.. ఇండియన్ పీనల్ కోడ్ పోలీసులకి ఏం చెప్తుంది.. తెగే వరకు లాగకండి అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఇక, బయటకు వస్తే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు అని డిప్యూటీ సీఎం పనవ్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు బాధ్యతలు తీసుకోవాలని చెప్పుకొచ్చారు. పదవి ఉండొచ్చు లేకపోవచ్చు ఐ డోంట్ కేర్.. గత ప్రభుత్వంలో లా పోలీసులు అలసత్వంగా ఉండకండి అని సూచించారు. అలాగే, 30 వేలు మంది ఆడ పిల్లలు మిస్ అయితే గత ప్రభుత్వంలో సీఎం మాట్లాడలేదు.. అత్యాచారాలు చేసే నీచులు, దుర్మార్గులను ఏం చేయాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వం తాలూకా వారసత్వం కొనసాగుతుంది.. గత ప్రభుత్వంలో నన్ను చంపేస్తామంటే ఒక్క పోలీస్ కూడా మాట్లాడలేదు.. గతంలో పోలీసులకి బాధ్యత లేదు.. గత ప్రభుత్వంలో రేప్ చేసే వారిని ఎంకరేజ్ చేశారని ఉప ముఖ్యమంత్రి పవన్ ఆరోపించారు.