Leading News Portal in Telugu

Massive Crowd of Devotees Rushed Srisailam Temple


  • శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ..

  • కార్తీకమాస మొదటి సోమవారం మల్లన్నకు ప్రీతికరమైన రోజు..

  • శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుస్వామి అమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం..
Srisailam Temple: భక్తులతో కిక్కిరిసిన మల్లన్న ఆలయం.. దర్శనానికి 4 గంటల సమయం

Srisailam Temple: శ్రీశైలంలో కార్తీకమాస మొదటి సోమవారం మల్లన్నకు ప్రీతికరమైన రోజు.. దీంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది.. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి.. కార్తీక దీపాలను వెలిగించి.. మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం క్షేత్ర పరిధిలో పలుచోట్ల భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అంచనతో.. భక్తులకు త్వరగతిన దర్శనం కల్పించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది.. ముందస్తుగా ఆలయంలో సామూహిక, గర్భాలయా అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేసింది.. భక్తులందరికి శ్రీమల్లికార్జునస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఇంఛార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అలానే నేటి సాయంత్రం కార్తీక మొదటి సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు..