Leading News Portal in Telugu

AP DGP Dwaraka Tirumala Rao Reaction on Deputy CM Pawan Kalyan Comments


  • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ..

  • దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ ఇదే మా విధానమని స్పష్టం చేసిన పోలీస్ బాస్..

  • మేం రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం..

  • రాజకీయ ఒత్తిళ్లతో మేం పని చేయబోమని స్పష్టం..

  • పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలపై నేను కామెంట్ చేయనన్న డీజీపీ..
DGP Dwaraka Tirumala Rao: డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ..

DGP Dwaraka Tirumala Rao: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. అయితే, ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపూడి అనిత కూడా స్పందించి క్లారిటీ ఇచ్చారు.. ఇక, అనంతపురం పర్యటనలో ఉన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందించారు.. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ ఇదే మా విధానం అన్నారు డీజీపీ.. మేం రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం.. రాజకీయ ఒత్తిళ్లతో మేం పని చేయబోమని స్పష్టం చేశారు.. అయితే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలపై నేను కామెంట్ చేయను అంటూ దాటవేశారు.. వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఏ కేసు నైనా విచారిస్తాం అన్నారు ఏపీ డీజీపీ..

ఇక, టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే… కేసు పెట్టకుండా భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ నిందితులను అరెస్ట్ చేయలేదు అని క్లారిటీ ఇచ్చారు డీజీపీ ద్వారకా తిరుమల రావు.. గతంలో నేరస్తున్న పట్టుకునేందుకు ఫింగర్ ప్రింట్స్ టెక్నాలజీ ఉన్నా… ఉపయోగించుకోలేదని విమర్శించారు.. మాజీ సీఐడీ చీఫ్ సంజయ్ నిధుల దుర్వినియోగంపై విచారణ జరుగుతుందన్నారు.. డీజీపీ ఆఫీస్ లో సంతకాలు చేస్తున్న వారిలో 10 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చాం.. మిగిలిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం అన్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు.. కాగా, ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. తాను హోంమంత్రిని అయితే… పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారాయన. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి భావప్రకటనా స్వేచ్ఛ అంటున్నారని… అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్డీఏ ఎమ్మెల్యేల పనితీరుపై కూడా పవన్‌ కల్యాణ్ ఘాటు విమర్శలు చేయడం చర్చగా మారిన విషయం తెలిసిందే.