- విద్యార్థునులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్
- అధికారులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు
- టీచర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

Teacher Arrest: విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన గురువు నీచంగా ప్రవర్తించాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లెక్కల టీచర్ విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యా సాగర్ తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ పోలీసులకు, స్థానిక తహశీల్దార్‌కు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉపాధ్యాయుడు గతంలో పనిచేసిన పాఠశాలల్లో ఇవే ఆరోపణలతో రెండు సార్లు సస్పెండ్ చేసినా అతని తీరు మారలేదని పాఠశాల సిబ్బంది పేర్కొంటున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.