Leading News Portal in Telugu

No Tensions for Pushpa The Rule Says Allu Arjun Team Member


Pushpa The Rule: అంతా అనుకున్నట్టే అవుతోంది.. టెన్షన్ పడొద్దు ఆర్మీ!

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ మీద సుకుమార్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన హార్డ్ డిస్కులు, కంటెంట్ అంతా కూడా నవంబర్ 20 కల్లా విదేశాలకు అలాగే ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లకు అందజేస్తాము అన్నట్టుగా గతంలో నిర్మాత కామెంట్ చేశారు. అలా చేయాలంటే ఈ లోపే షూటింగ్ పూర్తి చేయాలని ఇప్పట్లో షూటింగ్ పూర్తి చేయడం కష్టం కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం జరిగే అవకాశం లేదని ప్రచారం మొదలు అయింది.

Somy Ali: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదు, హత్య.. సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ సంచలనం..

తాజాగా ఈ విషయం మీద అల్లు అర్జున్ టీం మెంబెర్ ఒకరు స్పందించారు. ఈ సినిమా షూటింగ్ అంతా నవంబర్ 13 లేదా 12 లోపు పూర్తవుతుందని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాక అన్ని భాషలకు చెందిన డబ్బింగ్ అంతా మొదలైందని ఒకపక్క షూట్ జరుగుతుంటే మరోపక్క డబ్బింగ్ జరుగుతుందని చెప్పుకొచ్చారు. హీరో స్వయంగా ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తి చేశారని అన్ని అనుకున్నవి అనుకున్నట్టుగానే జరుగుతున్నాయని అన్నారు. అంతేకాదు ట్రైలర్ డేట్ తో పాటు ఇతర ఈవెంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒక మూడు, నాలుగు రోజుల్లో తెలియజేస్తామని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన పుష్పా 2 సినిమా గురించి అల్లు అర్జున్ ఆర్మీ భయపడాల్సిన అవసరమే లేదని చెప్పవచ్చు.