Leading News Portal in Telugu

Salary Hike for Priests in Andhra Pradesh


  • ఏపీలో ఆలయ అర్చకులకు శుభవార్త
  • దేవాలయాల్లో అర్చకులకు కనీస వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
  • అర్చకులకు 15 వేల రూపాయల వేతనం చెల్లించాలని సీఎం నిర్ణయం
Andhra Pradesh: దేవాలయాల్లో అర్చకులకు కనీస వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం

Andhra Pradesh: రాష్ట్రంలో 50 వేలకు పైగా ఆదాయం ఉన్న దేవాలయాల్లో అర్చకులకు కనీస వేతనం పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఆయా దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు 15 వేల రూపాయల వేతనం చెల్లించాలని సీఎం నిర్ణయించారని మంత్రి తెలిపారు. ఈ పెంపు కారణంగా ప్రభుత్వానికి 10 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడనుంది. ఇందులో కొంత భాగాన్ని సీజీఎఫ్ నిధుల నుంచి చెల్లింపులు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ పెంపుతో పాటు మొత్తం లబ్ది పొందే అర్చకుల సంఖ్య 3,203గా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో బ్రాహ్మణులు, అర్చకులు, వేద పండితులు, వేదాధ్యయనం చేసే విద్యార్థులకు నిరుద్యోగ భృతి ద్వారా ప్రభుత్వం మేలు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.