Leading News Portal in Telugu

US firm’s solar-powered car that could offer 1,000-mile range completes first drive


  • సోలార్ కార్లు వచ్చేస్తున్నాయి..

  • ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 1600 కి.మీ.
Solar Car: సోలార్ కార్‌లు వచ్చేస్తున్నాయి.. ఒక్క ఛార్జింగ్‌తో 1600 కి.మీ.

Solar Car: ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్‌లు(ఈవీ)ల వాడకం పెరిగింది. మనదేశంతో పాటు పలు దేశాల్లో ఈవీ కార్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా సోలార్ కార్లు కూడా రాబోతున్నాయి. శాన్‌డియాగోకి చెందిన అప్లేటా మోటార్స్ కంపెనీ సోలార్ విద్యుత్ కార్‌ని డెవలప్ చేసింది. మొదటి దశ టెస్టింగ్‌లో సానుకూల ఫలితాలు వచ్చాయి, రెండో దశ టెస్టింగ్ జరుగుతోంది. ఈ కార్‌ ఒక్కసారి ఛార్జ్ అయితే దాదాపుగా 1600 కి.మీ రేంజ్ ఇవ్వనుంది. త్వరలోనే సోలార్ కార్‌ని తీసుకురాబోతున్నట్లు అమెరికాకు చెందిన అప్లేటా మోటార్స్ కంపెనీ తెలియజేసింది. మొదటి టెస్టింగ్‌లో పీఐ 2 అనుకూల ఫలితాలను పొందింది. కారు బాడీని సోలార్ ప్యానెళ్లను జోడించి కనెక్ట్ చేస్తారు.

ఒక్కసారి దీనికి ఛార్జింగ్ పెడితే దాదాపుగా 1600 కిలోమీటర్లు అంటే వెయ్యి మైళ్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ఈ కారు తర్వాత పరీక్షలకు సిద్ధం అవుతోంది. రెండో దశలో పరీక్షలు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఇక ఈ కారును మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ సోలార్ ప్యానెల్ కార్ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని, ఏడాదిలో దాదాపుగా 11 వేల మైళ్ల వరకు ప్రయాణించవచ్చని చెబుతోంది.

కారులో స్ట్రాంగ్ బ్యాటరీ సెటప్ అమర్చడం వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1600 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. దీనిని ఛార్జింగ్ పెట్టడానికి ఎలాంటి ప్లగ్ ఇన్ అవసరం లేదు. ఆటోమేటిక్‌గా సూర్యరశ్మితో ఛార్జ్ అవుతుంది. ఈ కారుని వచ్చే ఏడాది మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎండలో ఉన్నంత సేపు ఇంటిగ్రేటెడ్ సోలార్ ప్యానెల్స్ ద్వారా కారు ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది.