Leading News Portal in Telugu

AP Govt appointed State Investment Promotion Committee as CS Chairman


  • కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

  • స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్ కమిటీని ఏర్పాటు..

  • రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా కమిటీ..
Andhra Pradesh: స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్ కమిటీ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్ కమిటీని ఏర్పాటు చేసింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, ఈ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్ కమిటీలో ఇండస్ట్రీస్ కమీషనర్ మెంబర్ కన్వీనర్ గా, ఫైనాన్స్, రెవెన్యూ, ఇరిగేషన్, ఇండస్ట్రీస్, ఇతర బాధ్యత గల డిపార్ట్మెంట్ ల స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు, సెక్రెటరీలను సభ్యులుగా నియమించారు.. కాగా, రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే పనిలో పడిపోయింది సర్కార్‌.. ఇప్పటికే మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటనలో పలు దిగ్గజ సంస్థలు.. ఆయా సంస్థల ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు.. ఏపీలో ఉన్న మౌలికసదుపాయాలపై వివరించారు.. ఇప్పుడు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్ కమిటీని నియమించింది ప్రభుత్వం.. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు.. వివిధ శాఖలపై, పాలసీల రూపకల్పనపై వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.. ఇంకో వైపు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తోన్న విషయం విదితమే..