- డొనాల్డ్ ట్రంప్ – కమలా హారిస్ మధ్య గట్టి పోటీ.
- కమలా హారిస్‌పై డోనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో.
- అందరూ కాలిఫోర్నియా వైపు చూపు.

US Election Results: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మంగళవారం ముగియగా.. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అలాగే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం కమలా హారిస్‌పై డోనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో కొనగసాగుతున్నారు. ట్రెండ్స్‌లో మాజీ అమెరికన్ ప్రెసిడెంట్ మెజారిటీకి చాలా దగ్గరగా వచ్చారు. భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ప్రతి ఒక్కరూ ఉత్తరప్రదేశ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తెలిసిన విషయమే. ఎందుకంటే, ఈ రాష్ట్రం నుంచి అత్యధికంగా 80 సీట్లు వస్తాయి.
అచ్చం అలాగే అమెరికాలో కూడా ఎన్నికలు వస్తే అందరూ కాలిఫోర్నియా వైపు చూడటం మొదలుపెడతారు. ఇక్కడ నుండి గరిష్టంగా 54 ఎలక్టోరల్ కాలేజీలు ఉండటం కూడా దీనికి కారణం. ఈ కారణంగా కాలిఫోర్నియాను ఉత్తరప్రదేశ్‌తో పోలుస్తారు. ఇక ఇక్కడి నుంచి ఎవరు గెలుస్తారో చూడాలి. ట్రంప్ లేదా హారిస్ ఎవరు గెలుస్తారో చూడాలి మరి.. అయితే ఇక్కడి నుంచి ఎవరు గెలిస్తే అధ్యక్షుడయ్యే అవకాశాలు పెరుగుతాయని చరిత్ర చెబుతోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల 2024లో ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో మీడియా నివేదికల ప్రకారం.. ట్రంప్ ఇప్పటికీ 230 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అదే సమయంలో కమలా హారిస్ 205 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎన్నికలలో ఇద్దరు భారతీయ సెనేటర్లు కూడా విజయాన్ని నమోదు చేసుకున్నారు. మిచిగాన్ నుంచి శ్రీ తానేదార్, వర్జీనియా నుంచి సుహాస్ సుబ్రమణ్యం గెలుపొందారు.