Leading News Portal in Telugu

అల్లు అర్జున్ పై కేసు క్వాష్ చేసిన ఏపీ హైకోర్టు | quash case on allu arjun| aphighcourt| direct| nandyal| police| big| relief| stylish


posted on Nov 6, 2024 12:00PM

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. ఎన్నికల సమయంలో ఆయనపై నమోదైన కేసును ఏపీ హైకోర్టు క్వాష్ చేసింది. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ కు మద్దతు పలికిన సంగతి తెలిసిందే.

ఆ సందర్భంగా  వేల సంఖ్యలో అల్లు అర్జున్‎ ఫ్యాన్స్ అక్కడకు చేరుకున్నారు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్న సమయంలో ముందస్తు అనుమతి లేకుండా అల్లు అర్జున్ ర్యాలీ నిర్వహించారంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చేసిన ఫిర్యాదు మేరకు నంద్యాల పోలీసులు అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిషోర్ పై కేసు నమోదు చేశారు.

ఆ కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు ఇరు పక్షాల వాదనా విన్న తరువాత బుధవారం (నవంబర్ 6) తీర్పు వెలువరించింది.  అల్లు అర్జున్ పై కేసును క్వాష్ చేస్తూ తీర్పు ఇచ్చింది.