Leading News Portal in Telugu

Government has expedited the process of identification of candidates for DSC 2008


  • 2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్
  • అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం
  • ఉమ్మడి జిల్లాలకు పరిశీలకుల నియామకం
  • నవంబర్ 8వ తేదీ లోపు అభ్యర్థుల వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశం
2008 Dsc: 2008 డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు.. ప్రక్రియ వేగవంతం

2008 డీఎస్సీ అభ్యర్థులకు రేవంత్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఉమ్మడి జిల్లాలకు పరిశీలకులను నియమించింది. నవంబర్ 8వ తేదీ లోపు అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని ఆదేశించింది. నిర్ణీత ప్రొఫార్మాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరైన అభ్యర్థుల జాబితాను సమర్పించాలని సూచించింది.

READ MORE: Pawan Kalyan: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ భేటీ

కాగా.. డీఎస్సీ-2008 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన డీఎస్సీ-2008 అభ్యర్థులను తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో.. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని డీఈవో ఆఫీసుల్లో దరఖాస్తులకు అవకాశం కల్పించింది. హైదరాబాద్‌ మినహా ఇతర జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. డీఈడీ ఉన్న వారికి 30 శాతం ఎస్‌జీటీ పోస్టులు కేటాయించింది. 30 శాతం రిజర్వేషన్‌ వల్ల నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు ప్రభుత్వం ఇప్పటికే సమాచారం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1200 మంది అభ్యర్థులకు లాభం చేకూరుతుంది. అంతేకాకుండా.. 16 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.

READ MORE:Deputy CM Pawan Kalyan: అమిత్‌ షాతో మర్యాదపూర్వకంగానే సమావేశమవుతున్నా..