Leading News Portal in Telugu

A turning point has taken place in the Agri Gold case.


  • అగ్రి గోల్డ్ కేసులో కీలక మలుపు

  • ఈడీ వేసిన ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకున్న కోర్టు

  • 32 లక్షల ఖాతాదారుల నుంచి 6380 కోట్లు వసూలు చేసినట్లు గుర్తింపు

  • 4141 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.
Agri Gold Case: అగ్రి గోల్డ్ కేసులో కీలక మలుపు.. పరిగణలోకి ఈడీ ఛార్జ్ షీట్‌

అగ్రి గోల్డ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌ని నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు పరిగణలోకి తీసుకుంది. మొత్తం 32 లక్షల ఖాతాదారుల నుంచి రూ. 6,380 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించింది. అలాగే.. 4,141 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా, అండమాన్ నికోబార్‌లో ఆస్తులు అటాచ్ చేశారు. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్ పేర్లతో పాటు అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపైనా ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది.

అగ్రి గోల్డ్ కేసులో 14 మందిని ఇప్పటికే ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. 130 సెల్ కంపెనీల ద్వారా నిధులు బదలాయించినట్లు గుర్తించారు. అగ్రి గోల్డ్ డబ్బులను వెంకట రామారావు ఇతర ఖాతాలకు మళ్లించారు. మళ్లించిన నిధులతో పవర్, రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్, ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టారు. పెద్ద మొత్తంలో లాభాలు ఇస్తున్నట్లుగా చూపెట్టి మోసం చేసింది అగ్రి గోల్డ్. కోట్ల రూపాయల డబ్బులను సొంత ఆస్తుల కోసం మళ్లించారు.