- రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షలు
- త్వరలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం
- మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి

Minister Satya Kumar Yadav: చాలా వరకు 70 శాతం మంది పలు అలవాట్ల వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. క్యా్న్సర్పై అవగాహన చాలా అవసరమన్నారు. సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్ల బారిన పడుతున్నారని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షలను ఏపీ సీఎం చంద్రబాబు త్వరలో ప్రారంభిస్తారని.. 4 కోట్ల మందికి క్యాన్సర్ పరీక్షలు చేస్తామని మంత్రి తెలిపారు. 18 వేల మందికి క్యాన్సర్ టెస్టులు చేయడంలో పరిజ్ఞానం కల్పించామన్నారు. ఇంటింటికి వెళ్లి క్యాన్సర్ అవగాహన కల్పించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
హోమీబాబా కేన్సర్ సెంటర్ వారి సహకారంతో ఈ అవగాహన కార్యక్రమాలు చేపడుతామని ఆయన చెప్పారు. 17 భోదన ఆసుపత్రులకు కేసులు రిఫర్ చేస్తామన్నారు. సెలబ్రిటీలను కూడా క్యాన్సర్ అవగాహనలో భాగస్వామ్యం కావాలని కోరామన్నారు. 125 మంది స్పెషలిస్ట్లను ఏర్పాటు చేశామన్నారు. స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ గ్రీన్ ఛానెల్ ద్వారా ఇప్పిస్తామని చెప్పారు. గత డయేరియా బారిన పడిన వారు 10.5 లక్షల మంది అని.. 4 నెలల్లో అద్భుతాలు చేయలేరు.. ఎవరూ ఏదీ చెడగొట్టలేరన్నారు. డయేరియాకు కారణం కలుషిత నీరు కారణం.. డ్రైనేజీల నిర్వహణ సరిగా లేకపోవడం కూడా కారణమేనన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. ఉపముఖ్యమంత్రి అయినా అతనూ ఒక తండ్రే.. సోషల్ మీడియా పోస్టులు, విమర్శలు పవన్ను బాధించాయన్నారు. పవన్ కావాలనుకుంటే ముందు హోంమంత్రి పదవి తీసుకునేవారని వ్యాఖ్యానించారు మంత్రి సత్యకుమార్ యాదవ్.