Leading News Portal in Telugu

Manchiryala District Bellampally MLA Vinod increased security


  • మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కు భద్రత పెంపు..

  • ఎమ్మెల్యే కార్యాలయానికి భద్రత పెంచిన పోలీస్ అధికారులు..

  • ఇటీవల మావోయిస్టు కోల్ బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ హెచ్చరిక లేఖ తో అలర్ట్..
MLA Gaddam Vinod: బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌కు భద్రత పెంపు.. ప్రభాత్‌ హెచ్చరిక లేఖతో అలర్ట్..

MLA Gaddam Vinod: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు పోలీసుల భద్రతను పెంచారు. ఎమ్మెల్యే కార్యాలయానికి పోలీస్ అధికారులు భద్రత పెంచారు. ఇటీవల మావోయిస్టు కోల్ బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ హెచ్చరిక లేఖ తో అలర్ట్ అయ్యారు. కార్యాలయం గేటు వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, బాంబు స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పర్యటనలో రోప్ పార్టీ టీం, సీఐ స్థాయి అధికారితో ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. త్రీ ప్లస్ త్రీ గన్‌మెన్ స్థాయికి పెంచారు. కార్యాలయం వద్ద ఎస్ఐ స్థాయి అధికారితో భద్రత పర్యవేక్షణ నిర్వహించారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా రోప్ పార్టీ ఆయన వెంటే ఉంటుంది. గురువారం తాండూరు, కాశిపేట మండలాల్లో ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతుండగా.. రోప్ పార్టీ బందోబస్తు చర్యలు చేపట్టారు. బెల్లంపల్లి ఏఎంసీ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో బాంబ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్‌ను ఏర్పాటు చేశారు. ప్రవేశ ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్‌తో స్క్రీనింగ్ చేసిన తర్వాత మాత్రమే సందర్శకులను అనుమతించనున్నారు పోలీసులు.
Social Media Posts: సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే అంతే.. ఎస్పీ సీరియస్‌ వార్నింగ్‌..