- ధర్మవరం చెరువు కబ్జా వ్యవహారంలో కేతిరెడ్డి ఫ్యామిలీకి నోటీసులు..
-
నోటీసులపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి.. -
నోటీసుల వెనుక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందని ఆరోపణ..

Kethireddy Venkatram Reddy: ధర్మవరం చెరువు కబ్జా వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కుటుంబానికి నీటిపారుదలశాఖ నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.. అయితే, ఆ నోటీసులపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు కేతిరెడ్డి.. చెరువు భూములు కబ్జా చేశారని తన తమ్ముడి భార్యకు నోటీసులు ఇవ్వడంపై రియాక్ట్ అయిన ఆయన.. ఈ నోటీసుల వెనుక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. చెరువు భూములు కబ్జా చేశారని వచ్చిన ఆరోపణలపై తాను గతంలోనే కోర్టుకు వెళ్లానని తెలిపారు.. దీనికి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నప్పటికీ.. అధికారంలో ఉన్నవారు నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, ఈ విషయంలో కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేస్తానని హెచ్చరించారు కేతిరెడ్డి… తన భూముల విషయంలో చాలా క్లియర్‌గా ఉన్నానని వెల్లడించారు..
చెరువు కబ్జా నోటీసులపై ఫేస్ బుక్ లైవ్ ద్వారా స్పందించిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. చీకటి ఉన్నట్టే పగలు కూడా ఉంటుందన్నారు.. కచ్చితంగా వీటన్నింటికీ సమాధానం ఇచ్చే రోజు వస్తుందన్నారు.. నా భూముల విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాను.. ఈ విషయం హైకోర్టులో ఉన్నప్పటికీ అధికారంలో నోటీసులు ఇచ్చారు.. కంటెంట్ ఆఫ్ కోర్టు కింద కేసు వేస్తాను అని వార్నింగ్ ఇచ్చారు.. నా నోటీసుల వెనుక కచ్చితంగా రాజకీయ కోణం ఉందన్నారు.. నాపై చేసిన ఆరోపణలు మీద గతంలోనే హైకోర్టుకు వెళ్లానన్నారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి..
కాగా, ధర్మవరం చెరువు కబ్జా వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కుటుంబానికి షాక్ ఇచ్చారు అధికారులు.. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ్ముడు భార్య వసుమతికి నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.. ధర్మవరం చెరువును కబ్జా చేశారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ్ముడు భార్య వసుమతికి నోటీసులు జారీ చేసినట్టుగా చెబుతున్నారు.. అయితే, చెరువు స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆ నోటీసుల్లో ప్రస్తావించారు నీటిపారుదలశాఖ అధికారులు… కబ్జా చేసిన చెరువు స్థలాన్ని ఏడు రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్న విషయం విదితమే..