Leading News Portal in Telugu

YSRCP who boycotted the Krishna, Guntur graduate MLC election


  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ కీలక నిర్ణయం..

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా వైసీపీ..
YSRCP: వైసీపీ కీలక నిర్ణయం.. ఆ ఎన్నికల్లో పోటీకి దూరం

YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత పేర్ని నాని ప్రకటించారు. పోలీసులను పెట్టి వైసీపీ నేతల్ని ఇష్టానుసారంగా అరెస్టులు చేయిస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నిక సక్రమంగా జరిగే అవకాశం లేదన్నారు. అందుకే తాము ఎన్నికల్లో పోటీ చేయకూడదని డిసైడయ్యామని తెలిపారు పేర్ని.. కాగా, గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి టీడీపీ తరపున ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు.

ఇక, పార్టీ నేతలను గ్రాడ్యూయేట్ ఓటర్లుగా నమోదు చేయించేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఓటర్ల నమోదు ను చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారు. అయితే, వైసీపీ తరపున అభ్యర్థులని ఖరారు చేయకపోవడంతో వారు తమ పార్టీ ఓటర్లను కూడా నమోదు చేయించలేకపోయారు. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మూడు పట్టభద్రుల గ్రాడ్యూయేట్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైంది. అప్పట్లో తమ ఓటర్లు వేరు అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గ్రాడ్యూయేట్లలో వైసీపీకి ఓటేసేవారు తక్కువగా ఉంటారన్న అంచనాతో పాటు మళ్లీ ఓడితే రకరకాల సమస్యలు వస్తాయన్న కారణంగా వెనుకడుగు వేసినట్లుగా తెలుస్తోంది. తక్కువ ఓట్లు నమోదు అయితే ఇంకా ఇబ్బందులు వస్తాయని పార్టీ నేతలు, వ్యూహకర్తలు నిర్ణయించడంతో ఆగిపోయినట్లుగా తెలుస్తోంది.