Leading News Portal in Telugu

Vijay Devarakonda slipped from the stairs video goes viral


Vijay Devarakonda: మెట్ల మీద నుంచీ జారి కింద పడ్డ విజయ్ దేవరకొండ!

రౌడీ విజయ్ దేవరకొండ ఓ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్తుండగా మెట్లపై నుంచి జారిపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జారిపడ్డ వెంటనే విజయ్ దేవరకొండను ఆయన టీం అలెర్ట్ అయి సురక్షితంగా అక్కడి నుండి బయటకు తీసుకొచ్చారు. ఆ తరువాత అభిమానులతో ఫొటోలు దిగుతూ కనిపించాడు విజయ్ దేవరకొండ. ఇక విజయ్ మెట్లపై నుండి జారిపడ్డాడు కానీ పెద్దగా గాయపడలేదు, వెంటనే లేచి బయటకు వచ్చాడు. ముంబైలో మితిబాయి క్షితిజ్ లో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మిథిబాయి క్షితిజ్ అంటే మిథిబాయి కళాశాల యొక్క యాన్యువల్ కల్చరల్ ఫోర్ డేస్ ఫెస్ట్.

Nithin Chauhan: ప్రముఖ నటుడు ఆత్మహత్య?

ఇక మరోపక్క గౌతమ్ తిన్ననూరితో తన తదుపరి చిత్రం షూటింగ్‌లో నటుడు విజయ్ దేవరకొండ గాయపడ్డారు. విరామం తీసుకునే సమయం లేనందున షూటింగ్ కొనసాగించినట్లు సినిమా టీం వెల్లడించింది. విజయ్ ఫైట్ సీక్వెన్స్‌లో గాయపడి భుజంలో నొప్పి రావడంతో ఫిజియో చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ఆ గాయం తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. నొప్పిని భరించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నా సినిమా షూటింగ్ మాత్రం ఆపలేదు. నటుడు విజయ్ దేవరకొండ తన ‘VD 14’ ఒక పీరియాడికల్ వార్ డ్రామా సినిమా అని అంటున్నారు ఈ సినిమాలో విజయ్ రాజుగా కనిపించనున్నాడని అంటున్నారు. మై త్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2025 ప్రారంభంలో షూటింగ్ ప్రారంభం కానుంది.