posted on Nov 9, 2024 9:58AM
గత వైసీపీ ప్రభుత్వ హాయంలో మాదకద్రవ్యాలకు ఎపి హబ్ గా మారిందని డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. విశాఖ సీ పోర్ట్ లో 25 కిలోల గంజాయి కంటైనర్ సిబిఐ స్వాధీనం చేసుకున్నప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇంతవరకు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదని పవన్ కళ్యాణ్ కేంద్ర హోమంత్రి అమిత్ షాకు ట్వీట్ చేశారు. రెండు రోజుల క్రితం ఆయన అమిత్ షాను కలిసిన నేపథ్యంలో తాజా ట్వీట్ ఎపి రాజకీయాల్లో సంచలనమైంది. ఇంటర్ పోల్ ఇచ్చిన సమాచారం మేరకు సిబిఐ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ గరుడ పేరుతో సిబిఐ ఈ డ్రగ్స్ రాకెట్ బయటపెట్టింది.
వైసీపీ హాయంలో ఎపిలో గంజాయి సాగు వేల ఎకరాల్లో సాగిందని విజయవాడ కేంద్రంగా ఈ వ్యాపారం మూడు పూవులు, ఆరు కాయలుగా వర్దిల్లిందని పవన్ ఆరోపించారు. జగన్ అవినీతి నేర సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి కేంద్రం సహకరించాలని పవన్ ఆ ట్వీట్ లో కోరారు.