Leading News Portal in Telugu

High Tension In Huzurabad, MLA Kaushik Reddy Arrested


  • హుజురాబాద్ లో ఉద్రిక్తత
  • దళితబంధు రాని వారు తనకు దరఖాస్తు ఇవ్వాలని సూచన
  • ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.
Huzurabad: హుజురాబాద్‌లో టెన్షన్ టెన్షన్.. కౌశిక్ రెడ్డికి అస్వస్థత

హుజురాబాద్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నియోజక వర్గంలో దళిత బంధు రెండో విడత రాని వాళ్లు తనకు దరఖాస్తు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. దరఖాస్తు ఇవ్వడానికి వచ్చిన వారితో కలిసి స్థానిక అంబేద్కర్ చౌరస్తాకు బయలుదేరిన కౌశిక్ రెడ్డిని పోలీసులు అడుకున్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కౌశిక్ రెడ్డి ధర్నాకు దిగేందుకు యత్నించారు. అనుమతి లేకుండా వందలాది మంది ఒక్కసారిగా అంబేడ్కర్ చౌరస్తా వద్దకు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేతో సహా పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చెలరేగి.. తోపులాట జరిగింది. దీంతో.. కౌశిక్ రెడ్డి ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆయనను పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని గులాబీ పార్టీ డిమాండ్ చేసింది. మరోవైపు.. పోలీసులు కౌశిక్ రెడ్డిపై దాడి చేశారని పలువురు బీఆర్ఎస్ నేతలు అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాగే ఆందోళనకారులను వ్యానులో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు పోలీసులు. నిరసన నేపథ్యంలో వరంగల్- కరీంనగర్ జాతీయ రహదారిపై దాదాపు గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి.