- రైతు గర్జనలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్ రావు
-
మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి- హరీష్ రావు -
రైతు బంధు.. రుణమాఫీ.. ధాన్యం కొనుగోళ్ళ కోసం రైతు దీక్ష చేస్తున్నాం- హరీష్ రావు -
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపేందుకే రైతు దీక్ష- హరీష్ రావు.
మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ రైతు గర్జన కార్యక్రమం నిర్వహించింది.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు సునీతా రెడ్డి, చింత ప్రభాకర్, మాణిక్ రావు, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ళ కోసం రైతు దీక్ష చేస్తున్నాం.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపేందుకే రైతు దీక్ష చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో చెప్పని ఎన్నో పథకాలు రైతుల కోసం కేసీఆర్ పెట్టారు.. రైతుల సీఎం కేసీఆర్ అని ఇతర రాష్ట్రాల్లోనూ అన్నారని హరీష్ రావు తెలిపారు. భూతుల సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచారు.. ఆరు గ్యారెంటీలు అమలు చేసిన అని మహారాష్ట్రలో రేవంత్ చెపుతున్నారు.. అందరిని మోసం చేసి మహారాష్ట్రలో అబద్దాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
Kishan Reddy: సీఎం చేయాల్సింది మూసీ యాత్ర కాదు.. కల్లాల్లో పర్యటించాలి
డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని మోసం చేశారు.. రుణమాఫీ చేయలేదని అడిగితె దేవుళ్ళ మీద ఒట్లు పెట్టారు.. దేశంలో దేవుడిని మోసం చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి వచ్చాక గ్యారెంటీలకు, బాండ్ పేపర్లకు విలువ లేకుండా పోయింది.. ఆరు గ్యారెంటీలని కాంగ్రెస్ ఓట్లను డబ్బాలో వేసుకుందని దుయ్యబట్టారు. ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ వమ్ము చేసింది.. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మోసం చేశారు.. సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితేనే కొంచమైనా రుణమాఫీ అయింది.. పంద్రాగస్టు రుణమాఫీ చేస్తానని తనతో ఛాలెంజ్ విసిరాడని.. వాయిదాల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తీవ్ర విమర్శలు చేశారు. మూసీ మురికికి కారకులు కాంగ్రెస్, టీడీపీ నేతలు అని హరీష్ ఆరోపించారు. ఆంధ్ర బాబుల బ్యాగులు మోసి.. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టారని రేవంత్ పై మండిపడ్డారు.
CM Chandrababu: శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు
నీ సవాల్‌కు రెడీ.. ఎక్కడ ఇళ్లు కూలగూడితే అక్కడ నుంచి చేద్దాం.. రేవంత్ రెడ్డి డైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. రేవంత్ ది తిట్లు అయితే.. బీఆర్ఎస్‌ది కిట్ల సర్కార్ అని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా రైతుబంధు ఇవ్వలేదు.. మూసీ మురికి కంటే రేవంత్ నోటి కంపు ఎక్కువగా ఉందని విమర్శించారు. మాటలు కాదు.. ప్రజలకు చేతలు చూపించు అని అన్నారు. రేవంత్ అందితే జుట్టు.. లేదంటే అబద్దాలు మాట్లాడుతున్నాడు.. సీఎం సోయితో మాట్లాడాలని పేర్కొన్నారు. సీఎం ఖుర్చీకి విలువ లేకుండా చేస్తున్నాడని దుయ్యబట్టారు. రైతుల ధాన్యం ఎప్పుడూ కొంటారో చెప్పాలి.. ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకుంటున్నారని అన్నారు. కల్లాల వద్దకు సీఎం, మంత్రులు రావాలి.. రైతుల గోస తెలుస్తుందని పేర్కొన్నారు. రేవంత్ మహారాష్ట్రకు డబ్బు మూటలు పంపే పనిలో ఉన్నారు.. కాంగ్రెస్ గ్యారెంటీల గారడీ అర్థమైంది.. మహారాష్ట్రలోనూ ఓటమి తప్పదని హరీష్ రావు తెలిపారు.