Leading News Portal in Telugu

Team India scored 124 runs. The South African bowlers bowled brilliantly.


  • రెండో టీ20లో విఫలమైన టీమిండియా బ్యాటర్లు
  • భారత్ స్కోరు 124/6
  • సౌతాఫ్రికా టార్గెట్ 125 రన్స్.
IND vs SA: బ్యాటర్లు విఫలం.. తక్కువ స్కోరు చేసిన భారత్

భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. మొదటగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తక్కువ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్యా చివరి వరకు ఉండి (39*) పరుగులు చేశాడు. ఆ తర్వాత.. అక్షర్ పటేల్ (27), తిలక్ వర్మ (20) పరుగులు సాధించారు. మిగతా బ్యాటర్లందరూ విఫలమయ్యారు.

గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్ డకౌట్‌తో నిరాశపరిచాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (4) విఫలమయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (4) కూడా రాణించలేకపోయాడు. చివర్లో రాణిస్తున్నాడనుకున్న రింకూ సింగ్ (9) చేతులెత్తేశాడు. అర్ష్‌దీప్ సింగ్ (7*) పరుగులు చేశారు. దీంతో.. టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. సౌతాఫ్రికా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించారు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో కేశవ్ మహరాజ్ తప్ప.. అందరు బౌలర్లు తలో వికెట్ పడగొట్టారు. మార్కో జాన్సెన్, కోయెట్జీ, సిమిలేనే, మార్క్రమ్, పీటర్ తలో వికెట్ సంపాదించారు.