Leading News Portal in Telugu

Godavari Districts Teacher MLC Election Gazette Notification Released


  • ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్
  • డిసెంబర్‌ 12లోగా ఎన్నిక నిర్వహణ పూర్తి చేయాలని నిర్ణయం
MLC Election: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్

MLC Election: తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్‌ 12లోగా ఎన్నిక నిర్వహణ పూర్తి చేయాలని నిర్ణయించారు.. ఈ నెల 18 వరకు నామినేషన్‌ పత్రాలను స్వీకరించనున్నారు. ఈ నెస 19న నామినేషన్లను పరిశీలించనున్నారు. డిసెంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్‌ 9న ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ వేయడానికి అవకాశం కల్పించనున్నారు. ఆరు జిల్లాల పరిధిలో 16,316 ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.