posted on Nov 11, 2024 12:42PM
ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వికారాబాద్ జిల్లా ప్రజలు కలెక్టర్ ప్రతీక్ జైన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫార్మా కంపెనీపై అధికారులు అభిప్రాయసేకరణ చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన కలెక్టర్ పై ప్రజలు ఎదురు తిరిగారు. కర్రలు, రాళ్లతో కలెక్టర్ పై దాడి చేయడంతో వెంటనే కలెక్టర్ కారులో వెనుదిరిగారు. దుద్యాల మండలంకు చెందిన లగచర్ల గ్రామంలో నిరసన చేసిన నిరసన కారులను పోలీసులు అడ్డుకున్నారు. తొలుత ఒక మహిళ కలెక్టర్ ను కొట్టారు. వెంటనే నిరసన కారులు కలెక్టర్ పై తిరగబడ్డారు. ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో అధికారులు , కలెక్టర్ తోకముడిచి వెనుదిరిగిపోయారు.