Leading News Portal in Telugu

లారీ చక్రాల క్రింద ఇరుక్కున్నయువతి ప్రాణాలు కాపాడిన బండి సంజయ్


posted on Nov 11, 2024 2:36PM

హుజూరాబాద్ నియోజకవర్గం సింగాపూర్ సమీపంలో  లారీ టైర్ల క్రింద చిక్కుకున్న యువతిని కేంద్రమంత్రి బండి సంజయ్ కాపాడారు. టైర్ల క్రింద ఆమె జుట్టు ఇరుక్కోవడంతో బండి సంజయ్  కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఆమె వైద్యంకు అయ్యే ఖర్చు తానే భరిస్థానని బండి సంజయ్ వెల్లడించారు.  లారీ జాకీలను తెప్పించి ఆ యువతని లారీ క్రింద నుంచి వెలికితీసి ప్రయివేటు ఆస్పత్రికి తరలించే ఆస్పత్రికి అయ్యే ఖర్చును తానే భరిస్థానన్నారు.  ములుగు పర్యటనకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కేంద్రమంత్రి తన వాహనాన్ని ఆపి బాధితురాలిని ఆదుకున్నారు. ఈ యువతి పేరు దివ్య శ్రీగా గుర్తించారు.