Leading News Portal in Telugu

Shigeru Ishiba re elected as Japanese PM


  • జపాన్ ప్రధానిగా తిరిగి షిగేరు ఇషిబా ఎన్నిక

  • జపాన్ 103వ ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు పోస్టు
Japan: జపాన్ ప్రధానిగా తిరిగి షిగేరు ఇషిబా ఎన్నిక

జపాన్‌కు చెందిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) నాయకుడు షిగేరు ఇషిబా జపాన్ డైట్‌లోని ఉభయ సభల్లో అత్యధిక ఓట్లు సాధించి దేశ ప్రధానమంత్రిగా తిరిగి సోమవారం ఎన్నికయ్యారు. ప్రధానమంత్రిని ఎంపిక చేసేందుకు డైట్ లేదా పార్లమెంట్ సోమవారం మధ్యాహ్నం అసాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో తిరిగి ఇషిబా గెలుపొందారు.

ఇషిబా ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ “నేను జపాన్ 103వ ప్రధానమంత్రిగా నియమించబడ్డాను. దేశీయ మరియు అంతర్జాతీయ వాతావరణంలో దేశ ప్రజలకు సేవ చేయడానికి నేను నా వంతు కృషి చేస్తాను.’’ అని వెల్లడించారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో జరిగిన రన్‌ఆఫ్ ఓటింగ్‌లో 67 ఏళ్ల ఇషిబా 221 ఓట్లను పొందారు. 233 మెజారిటీ థ్రెషోల్డ్‌కు తగ్గినప్పటికీ నోడాను అధిగమించి దేశ 103వ ప్రధానమంత్రిగా ఇసిబా ఎన్నికయ్యారు.