Leading News Portal in Telugu

first meeting of the Taskforce on Economic Development for Swarna Andhra Pradesh@2047


  • స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047 టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి భేటీ..

  • 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు..

  • అవకాశాల కల్పనతో సంపద సృష్టిస్తామన్న సీఎం చంద్రబాబు..
Andhra Pradesh: స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047 టాస్క్ ఫోర్స్ కమిటీ తొలి భేటీ.. 15 శాతం వృద్ధి రేటు టార్గెట్..

Andhra Pradesh: స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047పై పారిశ్రామిక వేత్తలతో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.. అవకాశాల కల్పనతో సంపద సృష్టిస్తామన్నారు.. విజన్-2047 లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై పారిశ్రామిక దిగ్గజాలతో మేధోమథనం నిర్వహించారు సీఎం చంద్రబాబు.. రానున్న రోజుల్లో 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు అమలు చేసి ఫలితాలు సాధించాలని సూచించారు.. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 13.5 శాతం వృద్ధి రేటు సాధించాం.. ఇప్పుడు 15 శాతం వృద్ధి రేటు సాధిస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు..

స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047పై సచివాలయంలో పారిశ్రామిక వేత్తలతో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది.. టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండగా.. కో ఛైర్మన్ గా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ఉన్నారు.. ఇక, సచివాలయంలో జరిగిన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, సీఐఐ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు హాజరయ్యారు.. అయితే, పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని టాటా గ్రూప్‌, ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. టాటా గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు..