- సాహిబా ప్రోమో విడుదల చేసిన మేకర్స్
- మ్యూజిక్ ఆల్బమ్ కు సుధాంశు సరియా దర్శకత్వం
- ఫోటోగ్రాఫర్ గా విజయ్ దేవరకొండ

వరల్డ్ వైడ్ గా ఛాట్ బస్టర్స్ లో నిలిచిన “హీరియే” సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ జోష్ తో కాస్త గ్యాప్ తర్వాత టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ జస్లీన్ రాయల్ తన కొత్త సాంగ్ “సాహిబా”తో మరోసారి మ్యూజిక్ లవర్స్ ముందుకు రాబోతున్నారు. “హీరియే” పాటలో, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మెరవగా. ఇప్పుడు రాబోతున్న “సాహిబా” మ్యూజిక్ ఆల్బమ్ లో టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించారు. విజయ్ కు జోడీగా రాధిక మదన్ కనిపించనున్నారు. వీరు ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
“సాహిబా” మ్యూజిక్ ఆల్బమ్ కు సుధాంశు సరియా దర్శకత్వం వహించారు. తన సరికొత్త సంగీత శైలి, భావోద్వేగాలతో “సాహిబా” పాటను శ్రోతల ముందుకు తీసుకురాబోతున్నారు జస్లీన్ రాయల్. ఈ పాట చిరకాలం మ్యూజిక్ లవర్స్ మనసుల్లో నిలిచిపోయేలా రూపొందించారు. ఈ రోజు మేకర్స్ “సాహిబా” ప్రోమోని విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రోమోలో విజయ్ దేవరకొండ ఫోటోగ్రాఫర్ గా కనిపించారు. విజయ్, రాధిక మదన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. “సాహిబా” కంప్లీట్ మ్యూజిక్ వీడియో ఈ నెల 15న విడుదల కానుంది. ఈ మ్యూజిక్ ఆల్బమ్ కోసం అటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో పాటు సంగీత ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్నసాహిబా ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి.
From #Heeriye to #Sahiba 😇
Beyond words, beyond time—a love story awaits.Releasing November 15th@TheDeverakonda @radhikamadan01 @dulQuer @PriyaSaraiya pic.twitter.com/a4IMxjx5hl
— Jasleen Royal (@jasleenroyal) November 11, 2024