Leading News Portal in Telugu

Another low pressure in Bay of Bengal.. Heavy rains in AP for 4 days..


  • నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం..

  • పశ్చిమ దిశగా తమిళనాడు / శ్రీలంక తీరాల వైపు కదలిక..!

  • ఉత్తరాంధ్ర నుండి పశ్చిమమధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి..

  • రేపటి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు..
Heavy Rains in AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు..

Heavy Rains in AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలతో పాటు తమిళనాడు, ఒడిశా లాంటి ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి.. అయితే, తాజాగా, ఐఎండీ సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది తదుపరి రెండు రోజుల్లో పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు / శ్రీలంక తీరాల వైపు కదిలేందుకు అవకాశం ఉందన్న ఆయన.. మరోవైపు నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర నుండి పశ్చిమమధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు.. దీని ప్రభావంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు అంటే ఈ నెల 12, 13, 14 తేదీల్లో రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు..

అయితే, వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది విపత్తుల నిర్వహణ సంస్థ.. ఇక, రాబోయే నాలుగు రోజులు వాతావరణం ఈ విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.. నవంబర్ 12న పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ , అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు 13న అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది..

ఇక, నవంబర్ 14న కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు మరియు బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది విపత్తుల నిర్వహణ సంస్థ.. అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు.. 15వ తేదీ విషయానికి వస్తే.. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వివరించారు..