Leading News Portal in Telugu

Physical Harassment on Seven Year Old Child in Nandyal District


  • నంద్యాల జిల్లా కొలుములపల్లి గ్రామంలో దారుణం
  • ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం
  • నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
Atrocious in Nandyal: దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం

Atrocious in Nandyal: దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దుర్మార్గులు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కొలుములపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి తెగబడ్డాడు. ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారిపై ఎల్లయ్య అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో చిన్నారి గట్టిగా కేకలు వేసింది. స్థానికులు గమనించడంతో నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.