Leading News Portal in Telugu

India’s second consecutive victory in Asian Champions Trophy 2024.. Victory over South Korea


  • మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా రెండో విజయం

  • రెండో మ్యాచ్‌లో 3–2తో దక్షిణ కొరియాను ఓడించిన భారత్

  • ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణ కొరియాకు తొలి ఓటమి.
Asian Champions Trophy 2024: భారత్ వరుసగా రెండో విజయం.. దక్షిణ కొరియాపై గెలుపు

మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. టోర్నీలో తమ రెండో మ్యాచ్‌లో 3–2తో దక్షిణ కొరియాను ఓడించింది. ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణ కొరియాకు తొలి ఓటమి. టోర్నమెంట్‌లో తన మొదటి మ్యాచ్‌ను జపాన్‌తో 2-2 డ్రాగా ముగిసింది. బీహార్‌లోని రాజ్‌గిర్ హాకీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున సంగీత కుమారి 3వ నిమిషంలో ఒక గోల్ చేసింది. దీపిక రెండు గోల్స్ 4వ నిమిషం, 56వ నిమిషంలో సాధించింది. ఈ మ్యాచ్‌లో దీపిక పెనాల్టీ స్ట్రోక్‌తో రెండో గోల్ చేసి భారత్‌ను మ్యాచ్‌లో ముందంజలో ఉంచింది. దక్షిణ కొరియా తరఫున యూరి లీ 34వ నిమిషంలో గోల్ చేయగా, 39వ నిమిషంలో చియోన్ యున్బీ పెనాల్టీ స్ట్రోక్ గోల్స్ చేసింది.

హాఫ్ టైమ్ వరకు మ్యాచ్ స్కోరు 2-0తో భారత్‌కు అనుకూలంగా ఉంది. కాగా.. భారత్ వర్సెస్ సౌత్ కొరియా మ్యాచ్ సాయంత్రం 4:45 గంటలకు ప్రారంభమైంది. భారత్ వర్సెస్ సౌత్ కొరియా మ్యాచ్‌కు ముందు చైనా టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. చైనా 5-0తో మలేషియాను చిత్తు చేసింది. చైనా కేవలం 2 మ్యాచ్‌ల్లోనే 20 గోల్స్ చేసింది. మలేషియాపై భారత్ 4-0 తేడాతో టోర్నీని విజయంంతో ప్రారంభించింది. సలీమా టెటె నేతృత్వంలోని భారత జట్టు మొదటి, మూడు, నాలుగో క్వార్టర్లలో గోల్స్ చేసింది. భారత్ తరఫున సంగీత కుమారి రెండు గోల్స్ చేయగా, ప్రీతి దుబే, ఉదిత చెరో గోల్ చేశారు.