Leading News Portal in Telugu

Mark Mobius Endorses PM Modi For Nobel Peace Price


  • ప్రధాని మోడీ నోబెల్ శాంతి బహుమతికి అర్హులు

  • అన్ని దేశాలతో మోడీకి సత్సంబంధాలున్నాయి

  • మార్కెట్ వెటరన్ మార్క్ మోబియస్ వెల్లడి
Mark Mobius: ప్రధాని మోడీ నోబెల్ శాంతి బహుమతికి అర్హులు

భారత ప్రధాని నరేంద్ర మోడీ నోబెల్ శాంతి బహుమతికి అర్హులు అని మార్కెట్ వెటరన్ మార్క్ మోబియస్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా మోడీ పాత్ర ప్రాముఖ్యత సంతరించుకుంటుందని.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలతో మోడీకి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. నోబెల్ శాంతి బహుమతికి అర్హమైన గొప్ప నాయకుడు అని కొనియాడారు. భవిష్యత్‌లో ప్రపంచ దేశాలకు శాంతి కర్తగా మారవచ్చని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: CISF: సీఐఎస్ఎఫ్‌లో మహిళలు.. మహిళా బెటాలియన్‌కు కేంద్రం ఆమోదం

ప్రపంచ వేదికపై శాంతికి మధ్యవర్తిగా వ్యవహరించేందుకు భారతదేశం చాలా మంచి స్థితిలో ఉందని మోబియస్ చెప్పారు. మోడీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ప్రముఖ పెట్టుబడిదారు మార్క్ మోబియస్ మద్దతు తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో మోబియస్ మాట్లాడుతూ.. మోడీ చాలా మంచి వ్యక్తి అంటూ ప్రశంసించారు. ప్రపంచంలో కీలక మధ్యవర్తిగా ఉండేందుకు ప్రధాని మోడీకి చాలా అర్హత ఉందని ఆయన అన్నారు. తన అభిప్రాయం ప్రకారం.. ప్రధాని మోడీ అత్యంత సమర్థుడని, నోబెల్ శాంతి బహుమతికి.. ప్రపంచ గౌరవానికి అర్హుడని మోబియస్ చెప్పుకొచ్చారు.

రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరిపేందుకు ఇటీవల ప్రధాని మోడీ ముందుకొచ్చారు. శాంతి చర్చలకు ఇండియానే కేంద్రం కావొచ్చని వార్తలు వినిపించాయి. యుద్ధం ముగింపునకు.. శాంతి చర్చలకు భారత్ మొగ్గుచూపించింది. జూన్ 2024లో స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్‌లో జరిగిన ఉక్రెయిన్‌ శాంతి సదస్సుకు భారత్‌ కూడా హాజరైంది.

ఇది కూడా చదవండి: Ponnam Prabhakar : నేతన్నలు అధైర్యపడవద్దు.. ప్రభుత్వం మీకు అండగా‌ ఉంటుంది