Leading News Portal in Telugu

ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు | ap assembly chief whip gv anjaneyulu| government appoints whips| mandali


posted on Nov 13, 2024 7:15AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ, శాసనమండలిలో  చీఫ్ విప్ లు, విప్ లను నియమించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి పేర్లను ఖరారు చేశారు. శాసనసభలో చీఫ్ విప్ గా జీవీ ఆంజనేయులును, శాసనమండలి చీఫ్ విప్ గా పంచుమర్తి ఆంజనేయులను ఖరారు చేశారు. ఇక  అసెంబ్లీలో 15 మందిని, మండలిలో ముగ్గురిని విప్ లు గా ప్రకటించారు. విప్ లలో జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. అసెంబ్లీ మండలిలోచీఫ్ విప్, విప్ ల జాబితా ఇలా ఉంది. . 

అసెంబ్లీలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

శాసనమండలిలో చీఫ్ విప్: పంచుమర్తి అనురాధ

అసెంబ్లీలో విప్ లు…

1. బొండా ఉమ (టీడీపీ)

2. కాలవ శ్రీనివాసులు (టీడీపీ)

3. యార్లగడ్డ వెంకట్రావు (టీడీపీ)

4. ఆదినారాయణరెడ్డి (బీజేపీ)

5. బొమ్మిడి నాయకర్ (జనసేన)

6. బెందాళం అశోక్ (టీడీపీ)

7. రెడ్డప్పగారి మాధవి (టీడీపీ)

8. అరవ శ్రీధర్ (జనసేన)

9. తంగిరాల సౌమ్య (టీడీపీ)

10. దాట్ల సుబ్బరాజు (టీడీపీ)

11. దివ్య యనమల (టీడీపీ)

12. పీజీవీఆర్ నాయుడు (టీడీపీ)

13. తోయక జగదీశ్వరి (టీడీపీ)

14. బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన)

15. వీఎం థామస్ (టీడీపీ)

మండలిలో విప్ లు..

1. వేపాడ చిరంజీవి (టీడీపీ)

2. పి.హరిప్రసాద్ (జనసేన)

3. కంచర్ల శ్రీకాంత్ (టీడీపీ)