if you dont want to play then dont play against us former Pakistan cricketer Rashid Latif Champions Trophy 2025
- వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ.
- ప్రపంచ పోటీలను నిర్వహించే హక్కును భారత్ – పాకిస్థాన్‌కు.
- ఇవ్వకూడదంటున్న మాజీ క్రికెటర్ లతీఫ్

Champions Trophy 2025: వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వడంపై సంక్షోభ మేఘాలు కమ్ముకున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత క్రికెట్ బోర్డు (BCCI) తన జట్టును పాకిస్తాన్‌కు పంపడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో మొత్తం టోర్నమెంట్ దేశం వెలుపల నిర్వహించబడుతుందనే ఊహాగానాలు వినపడుతున్నాయి. ఇదిలా ఉంటే, మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రషీద్ లతీఫ్ మాట్లాడుతూ.. ఏ టోర్నీలోనూ పాకిస్థాన్‌ను భారత్‌తో ఆడేందుకు అనుమతించేది లేదని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) రెండు దేశాల సమస్యలను పరిష్కరించే వరకు ప్రపంచ పోటీలను నిర్వహించే హక్కును రెండు దేశాలకు ఇవ్వకూడదని కూడా అతను సూచించాడు. టోర్నీ కోసం భారత్ పాకిస్థాన్‌కు వెళ్లడం కుదరదని బీసీసీఐ వ్రాతపూర్వకంగా ధృవీకరించాలని కోరుతూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఐసీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.
56 ఏళ్ల లతీఫ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్‌తో పాకిస్తాన్ క్రికెట్ ఆడటం ఆపే అవకాశం ఉంది. నాకు అధికారం ఉంటే, నేను బహుశా ఈ తీవ్రమైన చర్య తీసుకుని ఉండేవాడినని అన్నారు. దీనికి నేను ఎవరినీ నిందించను. ఎవరైనా పాకిస్థాన్‌లో ఆడకూడదనుకుంటే మాతో అస్సలు ఆడకండని ఆయన అన్నారు. నేను అక్కడ (భారత్ లో) ఉంటే ఈ నిర్ణయం తీసుకుని బీసీసీఐకి వ్యతిరేకంగా పోరాడి ఉండేవాడినని అన్నాడు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఐసీసీ భారత్, పాకిస్థాన్‌ల మధ్య మేజర్ టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వకూడదని లతీఫ్ సూచించాడు. ఇకపోతే, పాకిస్థాన్ తరఫున 37 టెస్టులు, 166 వన్డేలు ఆడాడు లతీఫ్. క్రికెట్‌లో రాజకీయ జోక్యంపై ముఖ్యంగా ఆసియాలో శ్రీలంక (2023), జింబాబ్వే (2019)పై ఐసీసీ నిషేధాన్ని ప్రస్తావించిన లతీఫ్.. భారతదేశం, పాకిస్తాన్ లపై ప్రపంచ పాలకమండలి ఎందుకు మెతకగా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు.
VIDEO | “There’s a big possibility that Pakistan can stop playing cricket against India. If I had would have been in power then yes, I may have taken this strong step. I would not blame anyone on this, if you don’t want to play then don’t play against us. If I had been there then… pic.twitter.com/BzcEh39Rbj
— Press Trust of India (@PTI_News) November 13, 2024