- కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో జెర్సీ కలకలం..
- ఓ కస్టమర్ భోజనంలో దర్శనం ఇచ్చిన జెర్రీ..
- తనిఖీలు నిర్వహించి సీజ్ చేసిన అధికారులు..
Kakinada Subbayya Gari Hotel: కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ హోటల్‌కు సంబంధించిన బ్రాంచీలు ఉన్నాయి.. అయితే, విజయవాడలోని కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో జెర్సీ కలకలం సృష్టించింది.. హోటల్లో ఓ కస్టమర్ భోజనం ఆర్డర్ ఇవ్వగా.. ఆ భోజనంలో జెర్రీ దర్శనం ఇచ్చింది.. దీంతో.. షాక్‌కు గురయ్యాడు సదరు కస్టమర్.. అదే సమయంలో అదే హోటల్లో భోజనం చేస్తున్నారు కేంద్ర మానవ హక్కుల కమిషన్ (NHRC) ఇంఛార్జ్ చైర్మన్ విజయభారతి సయానీ.. దీంతో.. కాకినాడ సుబ్బయ్యగారి హోటల్ నిర్వాహకుల తీరుపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సీరియస్ అయ్యింది.. ఈ వ్యవహారాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫర్యాదు చేసింది.. ఇక, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్‌ను పరిశీలించారు.. ఆ తర్వాత హోటల్ సీజ్ చేశారు.. శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు అధికారులు..
కాగా, రాష్ట్రంలో పలు మార్లు హోటళ్లు, రెస్టారెంట్లలోని ఫుడ్‌లో కూడా ఏదో ఒకటి కనిపించి.. కస్టమర్లను ఆందోళనకు గురిచేస్తున్న విషయం విదితమే.. ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు చేస్తూ.. ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేస్తున్నా.. కొన్ని హోటళ్లు తగు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో.. ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి..