Leading News Portal in Telugu

Nimmala Ramanaidu Discusses VEDAVATHI Lift Irrigation and Chintalapudi Project in AP Assembly


  • వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి 2019లో పాలన అనుమతులు ఇచ్చాం
  • వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం 4819 ఎకరాలు భూసేకరణ చేయాల్సి వస్తే
  • వైసీపీ కేవలం 9 ఎకరాలు మాత్రమే సేకరించింది
Nimmala Ramanaidu : వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి 2019లో 1,942 కోట్లతో పాలన అనుమతులు ఇచ్చాం

Nimmala Ramanaidu : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం నాడు కొన్ని కీలకమైన చట్ట సవరణలపై శాసనసభలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే.. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి 2019 జనవరి 29 న 1942 కోట్లతో పాలన అనుమతులు ఇచ్చామని తెలిపారు. వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం 4819 ఎకరాలు భూసేకరణ చేయాల్సి వస్తే , వైసిపి కేవలం 9 ఎకరాలు మాత్రమే సేకరించిందని, 2019-24 వైసీపీ పాలనలో వేదవతి ప్రాజెక్ట్ కు ఒక్కరూపాయి కూడా విడుదల చేయకపోవడంతో పనులు నిలిపేసింది మేఘా సంస్థ అని ఆయన వివరించారు. భూసేకరణకు 384 కోట్లు, సివిల్ వర్క్స్ కు 1456 కోట్లు ఖర్చవుతుందని గుర్తించామని, గుండ్రేవుల సమీపంలో కోట్ల విజయభాస్కర రెడ్డి సుంకేశుల బ్యారేజ్ నిర్మాణానికి 2890 కోట్లతో 2019 ఫిబ్రవరి లోనే డీపీఆర్ సిద్ధం అయిందని ఆయన వెల్లడించారు. అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ కావడం తో డీపీఆర్ ను తెలంగాణకు పంపామని, ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి మొత్తం 23 వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. వేదవతి, గుండ్రేవుల పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి రామానాయుడు.

Toyota Offers 2024: ఇయర్ ఎండ్ ఆఫర్‌.. ఈ టయోటా కార్లపై లక్ష తగ్గింపు!

నిన్న.. ‘జూన్ 2028 నాటికి చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. 2014-19మధ్య నిర్ణయించిన వ్యయంతో 40శాతం నిధులతో 39 శాతం పనులు జరిగాయని తెలిపారు. అయితే వైసీపీ పాలనలో కేవలం 7 శాతం నిధులతో 5 శాతం మాత్రమే పనులు సాగాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించారని పేర్కొన్నారు. మరో సభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల సమాధానమిస్తూ తాడేపల్లిగూడె ప్రాంతంలోని ఎర్రకాలువకు పెద్ద నష్టం కలిగిందని,దీని ఆధునికీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.’ అని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యా్‌ఖ్యానించారు.

Maharastra : నేడు ముంబైలో జరిగే ప్రధాని మోడీ ర్యాలీ.. అజిత్ పవార్ గైర్హాజరు