Atchannaidu Discusses Efforts for Geedimamidi Support Price and Board in AP Assembly | Latest Updates
- గత ఐదేళ్ళుగా ఏ శాఖ చూసినా ఏమున్నది అన్నట్టుగా తయారైంది
- జీడిమామిడి మద్దతు ధర ప్రకటించడానికి మా వంతు కృషి చేస్తున్నాం
- జీడిమామిడి మద్దతు ధర కోసం కేంద్రానికి లేఖ రాసాను
Atchannaidu : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం నాడు కొన్ని కీలకమైన చట్ట సవరణలపై శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లు 2024తోసహా మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు 2024ను ప్రభుత్వం శాసనసభకు సమర్పించింది. వీటితోపాటు ఏపీ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు, క్రమబద్దీకరణ చట్ట సవరణ బిల్లులను ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. జీడిమామిడి బోర్డు పెట్టాలని సభ్యులు కోరడంతో.. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గత ఐదేళ్ళుగా ఏ శాఖ చూసినా ఏమున్నది అన్నట్టుగా తయారైందన్నారు.
Amanatullah Khan : వక్ఫ్ బోర్డు కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు రిలీఫ్… విడుదలకు కోర్టు ఆదేశాలు
జీడిమామిడి మద్దతు ధర ప్రకటించడానికి మా వంతు కృషి చేస్తున్నామని, జీడిమామిడి మద్దతు ధర కోసం కేంద్రానికి లేఖ రాసానని, జీడిమామిడి పండుకు చాలా విలువ ఉంది… బైప్రోడక్టు గా చాలా ఆదాయం ఇస్తుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. కొబ్బరి చెట్ల కోసం గత ఐదేళ్ళలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని, మేం కొత్త చెట్లు ఇస్తాం… లాభసాటిగా తయారు చేస్తామన్నారు. ఉద్ధానం ప్రాంతంలో ఒక కోకోనట్ పార్కు కావాలని అడిగారు.. పూర్తి పశీలన చేసి నిర్ణయిస్తామని, జీడిమామిడి బోర్డు మన రాష్ట్రంలో రావాలి… సీఎం, కేంద్రమంత్రి దృష్టిలో పెట్టామన్నారు అచ్చెన్నాయుడు. శ్రీకాకుళంలో జీడిమామిడి బోర్డు పెడతామన్నారు.
Acteress Kasturi : కష్టాల సుడిలో కస్తూరి.. అరెస్ట్ కు రంగం సిద్ధం