Leading News Portal in Telugu

India To Host Champions Trophy If Pakistan Maintain Hard Stance..?


  • ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై కొనసాగుతున్న సందిగ్ధత..
  • భారత్‌ ఆతిథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు సిద్ధమైనట్లు న్యూస్ ప్రచారం..
  • డిసెంబర్ 1లోపే పాక్ హైబ్రిడ్‌ మోడల్‌కు అంగీకరించాల్సి ఉంది, లేకపోతే టోర్నీ మార్పు ఖరారు చేసే ఛాన్స్..
Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణలో బిగ్ ట్విస్ట్.. పాక్కి బదులు భారత్లోనే ఆతిథ్యం..?

Champions Trophy 2025: వచ్చే ఏడాది ప్రారంభమయ్యే ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఏ ఏ రికార్డులు, ఘనతలు నమోదు అవుతాయనే విషయం పక్కన పెడితే.. అసలు టోర్నీ నిర్వహణపై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతుంది. హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించేదే లేదని తెలిపిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు ఆర్థికంగా భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. టోర్నీ ఆతిథ్య హక్కులను దక్షిణాఫ్రికాకు తరలిస్తారనే న్యూస్ ప్రచారం అవుతుంది. ఇలా చేయడం వల్ల పాక్‌కు రావాల్సిన దాదాపు రూ.548 కోట్లు రాకుండా పోయే ప్రమాదం ఉంది. టీమిండియా జట్టు లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు ఐసీసీ ఎలాగూ ఇంట్రెస్ట్ చూపించదు. ఈ క్రమంలో తాజాగా మరొక న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. భారత్‌ ఆతిథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై అటు ఐసీసీ కానీ.. బీసీసీఐ కానీ ఎలాంటి ప్రకటనా వెల్లడించలేదు. డిసెంబర్ 1 లోపే పాకిస్థాన్‌ హైబ్రిడ్‌ మోడల్‌కు అంగీకరించాల్సి ఉంది. లేకపోతే ఐసీసీ ఛైర్మన్‌గా జైషా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టోర్నీ మార్పు ఫిక్స్ అవుతుందనే వార్తలు వినబడుతున్నాయి.

అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ వేదికే మారుతుందంటూ చర్చ కొనసాగుతున్న వేళ.. ఐసీసీ ఓ ప్రోమోను రిలీజ్ చేసినట్లు నెట్టింట వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో పాకిస్థాన్‌లోనే టోర్నీ జరుగుతుందనే సంకేతాలు వస్తున్నాయి. కానీ, సదరు వీడియో మాత్రం ఐసీసీ సోషల్ మీడియాలో కనబడటం లేదు. దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగబోతుంది. చివరిసారిగా 2017లో ఇంగ్లండ్‌లో జరిగింది. అప్పుడు పాకిస్థాన్‌ విజేతగా నిలిచింది. తుది పోరులో భారత్‌పైనే పాక్‌ విజయం సాధించింది.