Leading News Portal in Telugu

ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఎగ్జిక్యుటివ్ వైస్ చైర్మన్ గా సీతంరాజు సుధాకర్ | sitamraju sudhakar appointed as ntr vaidya seva trusy executive| vicepresident| vizag| resign| ycp| join| tdp| febraury


posted on Nov 15, 2024 10:05AM

విశాఖపట్నానికి చెందిన సీతంరాజు సుధాకర్ ను నియమిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు.  

వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన నేతకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమోషన్ ఇచ్చారు. ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవిని అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్టు (ఆరోగ్యశ్రీ ట్రస్టు) ఎగ్జిక్యూటివ్‌ వైస్‌-ఛైర్మన్‌గా విశాఖపట్నంకు చెందిన నేత సీతంరాజు సుధాకర్‌ను నియమించారు.ఆయన రెండేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. సీతంరాజు సుధాకర్ గతంలో  వైసీపీలో ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ లో ఆయన వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.   ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అభ్యర్థుల విజయం కోసం పని చేశారు. 

 వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో  దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న సీతంరాజు సుధాకర్  2013 వరకూ కాంగ్రెస్ లో ఉన్నారు. 2013లో  కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు.  2014 ఎన్నికల్లో  వైసీపీ పరాజయం పాలైన తరువాత సీతంరాజు విశాఖలో పార్టీ పటిష్టత కోసం పని చేశారు.   2019లో  వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో సీతంరాజు ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. ఆ తరువాత 2021లో ఆయనకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. తరువాత  2023 ఫిబ్రవరిలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.

సుధాకర్ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం కాగా.. అక్కడి నుంచి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన  వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి మద్దతు తెలపడంతో సీతంరాజు సుధాకర్ కు వైసీపీలో ప్రాధాన్యత తగ్గడం  మొదలైంది. దాంతో ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరకు గత ఏడాది డిసెంబర్ లో పార్టీకి  గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరారు.