Leading News Portal in Telugu

Biden’s Missile Approval By Changing Moscow’s Nuclear Doctrine


  • అణ్వాయుధాల విస్తృత వినియోగాని పుతిన్ గ్రీన్ సిగ్నల్..
  • ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం..
  • అమెరికా నిర్ణయంతో రష్యా చర్య..
Ukraine War: అణ్వాయుధాల వినియోగానికి పుతిన్ గ్రీన్ సిగ్నల్.. అమెరికాకి వార్నింగ్..

Ukraine War: ఉక్రెయిన్, రష్యాల మధ్య మరింత ఉద్రిక్తలు పెంచేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నాడు. రష్యాలోని సుదూర లక్ష్యలను కొట్టేలా, సుదూర క్షిపణులను ఉపయోగించుకునేందు జో బైడెన్ ఉక్రెయిన్‌కి అనుమతి ఇచ్చారు. ఈ పరిణామం ఉక్రెయిన్ యుద్ధంలో సంఘర్షణ స్థాయిని పెంచింది.

అయితే, ఈ నిర్ణయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించాడు. తమపై ఎవరైనా ధాడికి దిగినట్లైతే అణ్వాయుధాలను విస్తృతంగా వాడేందుకు అనుమతి ఇచ్చారు. మంగళవారం దీనికి సంబంధించిన డిక్రీపై పుతిన్ సంతకం చేశారు. రష్యా-ఉక్రెయిన్‌పై దాడి చేసిన 1000 వ రోజు రష్యా నుంచి ఈ నిర్ణయం వచ్చింది. అంతకుముందు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కీలమైన విధాన మార్పు చేసింది. ఉక్రెయిన్ మొదటిసారిగా రష్యాలోని లక్ష్యాలను ఛేదించడానికి యూఎస్ తయారీ ATACMS క్షిపణులను ఉపయోగించడానికి అనుమతించింది.

మరో రెండు నెలల్లో డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకునే సమయంలో బైడెన్ నుంచి ఈ నిర్ణయం వచ్చింది. మంగళవారం ఉక్రెయిన్‌ని ఓడించాలని రష్యా ప్రతిజ్ఞ చేసింది. ఉక్రెయిన్‌‌కి పాశ్చాత్య దేశాల మద్దతు తమపై ఎలాంటి ప్రభావం చూపించదని, ఆ దేశంపై సైనిక చర్య కొనసాగుతుందని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ చెప్పారు.