మహారాష్ట్ర, జార్ఖండ్.. బీజేపీకే పట్టం- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ అంచనా | jarkhand and maharashtra vote for bjp| peoplespulse| exit
posted on Nov 20, 2024 5:07PM
మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలలో బీజేపీ జయకేతనం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో ఈ సారి ఎన్నికలలో బీజేపీ ఒంటరిగా అధికారాన్ని చేజిక్కించుకుంటుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. ఈ సారి ఎన్నికలలో జార్ఖండ్ లో బీజేపీ 42నుంచి 48 స్థానాలలో విజయం సాధించి సాధారణ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించు కుంటుందని పేర్కొంది. 16 నుంచి 23 స్థానాలతో జార్ఖండ్ ముక్తి మోర్చా రెండో స్థానంలోనూ 8 నుంచి 14 స్థానాలతో కాంగ్రెస్ మూడో స్థానంలోనూ నిలుస్తాయని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. అలాగే మహారాష్ట్రలో కూడా బీజేపీ నాయకత్వంలోని మహాయతి కూటమి 175 నుంచి 195 స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని పేర్కొంది.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా.. బుధవారం అన్ని స్థానాలకూ కలిపి ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలలో పోటీ ప్రధానంగా జేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలతో కూడిన మహా వికాస్ అఘాడీ మధ్య పోరు సాగింది. తొలి అంచనాల ప్రకారం ఈ ఎన్నికలలో హోరాహోరీ తప్పదని అంతా భావించినా పోలింగ్ తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం బీజేపీ నేతృత్వంలోని మయాయతి కూటమి ఏకపక్ష విజయం సాధిస్తుందని తేలింది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహాయత కూటమి 175 నుంచి 195 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ 85 నుంచి 112 స్థానాలకే పరిమితం ఔతుంది.
మహాయతి కూటమిలో బీజేపీ సొంతంగా 102 నుంచి 120 స్థానాలలోనూ, ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 46 నుంచి 51 స్థానాలలోనూ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 14 నుంచి పాతిక స్థానాలలోనూ విజయం సాధించే అవకాశం ఉంది.
ఇక కాంగ్రెస్ నాయకత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ సొంతంగా 24 నుంచి 44 స్థానాలలోనూ, ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన 21 నుంచి 31 స్థనాలలలోనూ, శరద్ పవాన్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 28 నుంచి 41 స్థనాలలోనూ విజయం సాధిస్తుంది. ఇతరులు 6 నుంచి 12 స్థానాలలో గెలుపొందే అవకాశం ఉంది.