Leading News Portal in Telugu

International Criminal Court issues arrest warrant for Israel PM Netanyahu


  • ఇజ్రాయిల్ పీఎం, మాజీ రక్షణమంత్రికి ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ..
  • గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడ్డారని ఆరోపణ..
ICC: పీఎం నెతన్యాహూ, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌లపై అరెస్ట్ వారెంట్ జారీ..

ICC: ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌లపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. గాజాలో మానవత్వానికి వ్యతిరేకంగా, యుద్ నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఈ వారెంట్లను జారీ చేసింది. ఆకలిని యుద్ధపద్ధతిగా ఉపయోగించారిన ఐసీసీ చెప్పింది. వారెంట్ల ప్రకారం.. ఐసీసీ 122 సభ్య దేశాల భూభాగంలోకి నెతన్యాహూ, గాలంట్ ప్రవేశిస్తే వారిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది.

గతేడాది అక్టోబర్ 07న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడులు చేసి 1200 మందిని హతమార్చారు. 240 మంది వరకు ఇజ్రాయిలీ బందీలనున గాజాలోకి పట్టుకెళ్లారు. ఈ దాడి తర్వాత నుంచి ఇజ్రాయిల్ గాజాలోని హమాస్‌పై యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో హమాస్ మిలిటెంట్లతో పాటు సాధారణ ప్రజలు కూడా మరణించారు. ఇప్పటికే 44,000 కన్నా ఎక్కువ మంది చనిపోయారు. మరోవైపు 101 మంది ఇజ్రాయిలీ బందీలు ఇంకా గాజాలోనే ఉన్నారు. వీరి ఆచూకీ కోసం ఇజ్రాయిల్ వెతుకుతోంది.