Leading News Portal in Telugu

Sritej Health Bulletin Released by KIMS Hospital


Sritej Health Bulletin: విషమంగానే శ్రీ తేజ్ ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల

సంధ్య థియేటర్ లో గాయపడిన శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది కిమ్స్ హాస్పిటల్. శ్రీ తేజ ఆరోగ్యం విషమంగానే ఉందని, వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నామని పేర్కొన్నారు. అతని జ్వరం తగ్గుతోందని మినిమం ఐనోట్రోప్స్‌లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఫీడ్‌లను బాగా తట్టుకుంటున్నాడని కూడా పేర్కొన్నారు. స్టాటిక్ న్యూరోలాజికల్ స్థితి దృష్ట్యా, వెంటిలేటర్ నుండి బయటకు తీసుకురావడానికి ట్రాకియోస్టోమీని ప్లాన్ చేస్తున్నారని పేర్కొన్నారు. మరోపక్క శ్రీతేజ్ ప్రస్తుతానికి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

Prabhas’ Fauji: ఫౌజి కోసం ఊహించని రిస్క్

ఈరోజు ఆ బాలుడిని హైదరాబాద్ సి పి సి వి ఆనంద్ పరామర్శించారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగి రెండు వారాలు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు ప్రభుత్వం తరఫున తనతో పాటు హెల్త్ సెక్రటరీ కూడా శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నామని అన్నారు. తొక్కిసలాటలో శ్రీ తేజ బ్రెయిన్ డామేజ్ జరిగిందని, రికవరీ జరగడానికి చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చారు ఈ ట్రీట్మెంట్ సుధీర్గంగా సాగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే శ్రీ తేజ్ ఆరోగ్యం గురించి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని చెప్పుకొచ్చారు. మరోపక్క హెల్త్ సెక్రటరీ క్రిస్టినా మాట్లాడుతూ శ్రీ తేజ్ ట్రీట్ మెంట్ గురించి మానిటర్ చేస్తున్నామని అన్నారు. వైద్యులను ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నామని పేర్కొన్న ఆమె శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు.