Leading News Portal in Telugu

Eating papaya fruit in winter has many health benefits.


  • శీతాకాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ
  • చల్లని వాతావరణంలో ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ బొప్పాయిని తినండి
  • శరీరాన్ని హైడ్రేట్ చేసే సూపర్ ఫుడ్.
Health Benefits: ఈ పండు అమృతం.. చలికాలంలో తిన్నారంటే రోగాలు మటుమాయం

శీతాకాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే.. రోగనిరోధక శక్తి వేగంగా బలహీనమైపోతుంది. ఈ క్రమంలో.. ఎక్కువగా అనారోగ్యానికి గురవుతారు. చలికాలంలో రోగ నిరోధక శక్తి తగ్గకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా.. జీవనశైలిలో మార్పులు, చల్లని వాతావరణానికి దూరంగా ఉండాలి. రోగనిరోధక శక్తి కారణంగా వల్ల జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు చాలా ఇబ్బందికి గురి చేస్తాయి. అయితే.. మీరు చల్లని వాతావరణంలో మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ప్రతిరోజూ బొప్పాయిని తినండి. శరీరాన్ని హైడ్రేట్ చేసే సూపర్ ఫుడ్. చల్లని వాతావరణంలో దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి లోపాన్ని తీర్చి, జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో 200 గ్రాముల బొప్పాయిని తింటే శరీరానికి సంపూర్ణ పోషణ అందుతుందని ఆరోగ్య నిపుణులు, యోగా గురువులు చెబుతున్నారు. ఈ పండు పోషకాల లోపాన్ని తీర్చి.. శరీరానికి శక్తిని ఇస్తుంది. రోజూ బొప్పాయి తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తి బలపడుతుంది:
బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో.. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులను నివారిస్తుంది. ఈ పండును రోజూ తినడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. బొప్పాయి తింటే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచి.. వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది.

జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది:
మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు చలికాలంలో చాలా ఇబ్బంది పెడతాయి. ఈ క్రమంలో.. రోజూ బొప్పాయిని తీసుకుంటే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయి. బొప్పాయిలో పపైన్ ఎంజైమ్, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజూ 200 గ్రాముల బొప్పాయి తింటే గంటల తరబడి టాయిలెట్‌లో కూర్చోవాల్సిన అవసరం ఉండదు.

బరువు నియంత్రించబడుతుంది:
బొప్పాయి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పండులో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. చల్లని వాతావరణంలో శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం, అధిక ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోజూ బొప్పాయి తింటే బరువు అదుపులో ఉంటుంది.

చర్మం తేమగా ఉంటుంది:
చలికాలంలో నీరు తక్కువగా తీసుకోవడం వల్ల చర్మం పొడిబారుతుంది. అలాంటి పరిస్థితుల్లో చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి.. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు బొప్పాయిని రోజూ తింటే చర్మానికి పోషణ లభిస్తుంది. విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న బొప్పాయి చర్మంలో తేమను కాపాడుతుంది.

గుండె ఆరోగ్యంగా ఉంటుంది:
యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఒక ప్లేట్ బొప్పాయి తినడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు బొప్పాయి అమృతం:
బొప్పాయి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పండు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం లేదు. డయాబెటిక్ పేషెంట్లు రోజూ తింటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. రక్తంలో చక్కెర కూడా సాధారణంగా ఉంటుంది.