- భయం పుట్టిస్తున్న ఫలితాలు
- 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే ఏం జరుగుతోంది?
- చిత్రాల ద్వారా వెల్లడించిన పరిశోధకులు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘డిజిటల్ మోడల్’ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. మనకు తగినంత నిద్ర లేకపోతే 2050 నాటికి మనుషులు ఎలా ఉంటారో ఆ చిత్రాల ద్వారా చెబుతున్నారు. బ్రిటిష్ కి చెందిన స్లీప్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ సోఫీ బోస్టాక్ సహాయంతో బెన్సన్స్ ఫర్ బెడ్స్ అనే సంస్థ.. ఈ పరిశోధన చేసింది. స్త్రీ శరీరం సాధారణంగా రాత్రికి ఆరు గంటలపాటు నిద్రపోతే ఆమె 25 ఏళ్లలో ఎలా మార్పు చెందుతోందో డిజిటల్ చిత్రాల ద్వారా తెలిపారు.
READ MORE: KTR Letter: దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ
ఈ డిజిటల్ చిత్రాల్లో హన్నా 45 ఏళ్ల బ్రిటిష్ మహిళగా పేరు పెట్టారు. గత 25 ఏళ్లుగా రోజుకు కనీసం ఆరు గంటల పాటు కూడా నిద్ర పోలేకపోతే ఎలా అవుతుందో చిత్రాలు తెలుపుతున్నాయి. 2025లో వెన్నునొప్పి, జుట్టు పల్చబడడం, చర్మం వదులుగా ఉండడం, కాళ్లు వాచిపోవడం, కళ్లు ఎర్రబడడం వంటి సమస్యలు వచ్చాయి. చిత్రంలో చేతులు, కాళ్ళ కండరాలు కూడా సన్నగా మారాయి. రోగనిరోధక శక్తి తగ్గి.. బలహీనంగా కనబడుతోంది. ఈ నిద్రలేమి సమస్యల వల్ల మళ్లీ మళ్లీ ఫ్లూ బారిన పడే అవకాశం ఉంది. అంతే కాకుండా ఆకలిని పెంచే హార్మోన్లు కూడా తగ్గుతాయి. స్థూలకాయం, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్‌తో రోగాలు చుట్టుముడుతాయి. శరీర ఆకారం వంకర మారడంతో పాటు చర్మం పూర్తిగా ముడతలు పడింది.
READ MORE: Maharashtra: నిన్న ఫడ్నవిస్‌తో ఉద్ధవ్ థాక్రే.. నేడు ప్రధానితో శరద్ పవార్ భేటీ.. ఎంవీఏలో ఏం జరుగుతోంది!?
ఇదిలా ఉండగా.. ఏ వయస్సులో ఉన్న వ్యక్తి ఎన్ని గంటలు నిద్రపోవాలో ఇప్పుడు తెలుసుకుందా.. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ తన అధ్యయనంలో తెలిపిన వివరాల ప్రకారం..
0-3 నెలలు: నిద్ర సమయం 14 నుంచి 17 గంటలు ఉండాలి. 9 గంటల కంటే తక్కువ-19 గంటల కంటే ఎక్కువ ఉండకూడదు.
4-11 నెలలు: 12 -15 గంటలు నిద్రించాలి. 10 గంటల కంటే తక్కువ లేదా 18 గంటల కంటే ఎక్కువ ఉండొద్దు.
1 -2 సంవత్సరాలు: 11 5-14 గంటలు. 9 గంటల కంటే తక్కువ లేదా 16 గంటల కంటే ఎక్కువ ఉండకూడదు.
3 -5 సంవత్సరాలు: 10- 13 గంటలు నిద్ర తప్పనిసరి. 8 గంటల కంటే తక్కువ, 14 గంటల కంటే ఎక్కువ.
6-13 సంవత్సరాలు: 9-11 గంటలు. 7 గంటల కంటే తక్కువ, 12 గంటల కంటే ఎక్కువ.
14-17 సంవత్సరాలు: 8 -10 గంటలు. 7 గంటల కంటే తక్కువ,11 గంటలకు మించకూడదు.
18- 25 సంవత్సరాలు: 7 -9 గంటలు. 6 గంటల కంటే తక్కువ,11 గంటలకు మించకూడదు.
26- 64 సంవత్సరాలు: 7 నుంచి 9 గంటలు. 6 గంటల కంటే తక్కువ.10 గంటలకు మించకూడదు.
65 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ: 7 నుంచి 8 గంటలు. 5 గంటల కంటే తక్కువ, 9 గంటల కంటే ఎక్కువ నిద్రించాలి.