- ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత..
- నేడు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై హౌతీ రెబల్స్ క్షిపణి దాడి..
- క్షిపణిని అడ్డుకోవడంలో విఫలమైన ఇజ్రాయెల్.. 14 మందికి గాయాలు..
Houthi Rebels: ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య ఉద్రిక్తత కొనసాగుతుంది. వరుస దాడులతో పశ్చిమాసియా అట్టుడుకిపోతుంది. గురువారం నాడు యెమెన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయగా.. నేడు హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై క్షిపణితో దాడి చేశారు. అయితే, ఆ క్షిపణిని అడ్డుకోవడంలో తాము ఫెయిల్ కావడంతో 14 మందికి తీవ్ర గాయాలైనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పుకొచ్చింది.
ఇక, గాజాలో యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి హౌతీలు ఇజ్రాయెల్‌పై క్షిపణిలతో దాడులకు దిగుతున్నారు. వీరికి ఇరాన్ సపోర్ట్ ఇస్తోంది. తాము పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఈ దాడులు చేస్తున్నట్లు హౌతీ తిరుగుబాటుదారులు చెప్తున్నారు. గాజాపై యుద్ధాన్ని ఆపేవరకు ఇజ్రాయెల్‌పై క్రమంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో హౌతీల సైనిక స్థావరాలే లక్ష్యంగా టెల్ అవీవ్ మిలిటరీ దళాలు ప్రతిదాడులు కొనసాగిస్తున్నాయి. ఇక, హౌతీల తీవ్రవాద ప్రయోజనాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఇరాన్ ఆయుధాలు ఈ ప్రాంతానికి అక్రమంగా రవాణా చేయడాన్ని నిరోధించడానికి ఇజ్రాయెల్ వారి స్థావరాలపై దాడులు చేస్తుందని సైనిక ప్రతినిధి డేనియల్ హగారి వెల్లడించారు. హౌతీ రెబల్స్ దాడుల నుంచి తమ పౌరులను రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడమని టెల్ అవీవ్ పేర్కొనింది.