Leading News Portal in Telugu

Union Minister Hardeep Singh Puri vs Shashi Tharoor on dinner party with Soros: Recollections differ


  • భారత్‌ను అస్థిరపర్చడానికి విదేశీ శక్తులతో కాంగ్రెస్‌ చేతులు కలిపింది: బీజేపీ
  • అమెరికాలో 2009లో ఏర్పాటు చేసిన విందు లిస్టులో జార్జ్‌ సోరోస్‌ పేరుంది: కేంద్రమంత్రి పూరి
  • జార్జ్ సోరోస్‌ వ్యాపారవేత్తగానే తెలుసు.. ఏ సంస్థతో సంబంధాలు తెలియదు: ఎంపీ శశిథరూర్
Congress: జార్జ్‌ సోరోస్‌ను విందుకు ఆహ్వానించారన్న కేంద్ర మంత్రి.. శశి థరూర్‌ సీరియస్..!

Congress: భారత్‌ను అస్థిరపర్చడానికి విదేశీ శక్తులతో కాంగ్రెస్‌ చేతులు కలిపిందని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. అమెరికా వ్యాపారవేత్త జార్జ్‌ సోరోస్‌తో కాంగ్రెస్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని బీజేపీ తెలిపింది. ఈ నేపథ్యంలో అమెరికాలో 2009లో ఏర్పాటు చేసిన డిన్నర్ కు ఆహ్వానితుల జాబితాలో జార్జ్‌ సోరోస్‌ పేరును కాంగ్రెస్‌ ఎంపీ, నాటి విదేశాంగ సహాయమంత్రి శశిథరూర్ చేర్చారని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్ పూరి వెల్లడించారు. ఆ సమయంలో తాను ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధిగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

ఇక, కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్ పూరి అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలిపారు. 2009లో వివిధ దేశాలలోని ముఖ్య నేతలు, వ్యక్తుల పేర్లను సేకరించి వారికి ఆహ్వానం పంపించాం.. అప్పుడు సోరోస్‌ ఓ వ్యాపారవేత్తగానే తెలుసు.. ఆయనకు భారత్‌లోని ఏ సంస్థతో సంబంధాలు ఉన్నాయో నాకు తెలియదన్నారు. దాని గురించి ఆయనతో ఏ రోజు కూడా చర్చించలేదన్నారు. ఆ మీటింగ్ లో గ్లోబల్‌ వార్మింగ్‌కు పశ్చిమదేశాలదే బాధ్యత అని భారత సర్కార్ ఆరోపనలు చేసింది.. అయితే దానికి ఆయన తీవ్ర అభ్యంతరం తెలపడం మాత్రమే గుర్తుందని శశిథరూర్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

అయితే, రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు సోనియా నేతృత్వం వహించడం సోరోస్‌ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కొనసాగించారు. ఇక, జార్జ్ సోరోస్‌ తమకు పాత మిత్రుడని తెలియజేస్తూ.. 2009లో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతుంది. దీనిపై కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్ పూరి స్పందిస్తూ సోరోస్‌తో కాంగ్రెస్‌ నేతలకు ఉన్న సంబంధాలపై కామెంట్స్ చేశారు.