Leading News Portal in Telugu

Prime Minister Narendra Modi reaches Kuwait


  • కువైట్ చేరుకున్న ప్రధాని మోడీ.. ఘనస్వాగతం
  • రెండు రోజుల పాటు కువైట్‌లో పర్యటించనున్న మోడీ
PM Modi: కువైట్ చేరుకున్న ప్రధాని మోడీ.. ఘనస్వాగతం

ప్రధాని మోడీ కువైట్ చేరుకున్నారు. కువైట్ రాష్ట్ర అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం కువైట్ చేరుకున్నారు. 43 సంవత్సరాల్లో భారత ప్రధానమంత్రి కువైట్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ బయల్దేరి కువైట్ వెళ్లారు. కువైట్‌లో దిగగానే అక్కడి అధికారులు మోడీకి స్వాగతం పలికారు. అలాగే భారతీయులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమాలను ప్రధాని శ్రద్ధగా తిలకించారు. అనంతరం వారితో ముచ్చటించన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. దేశంలోని అగ్ర నాయకులతో పాటు భారతీయులను కలుసుకోనున్నారు. అలాగే భారత కార్మిక శిబిరాన్ని సందర్శించనున్నారు.