Leading News Portal in Telugu

రూ.10వేల కోట్లతో ఏపీలో సోలార్ విద్యుత్ ప్లాంట్ | solar power plant in ap| biggest| in| asia| reliance| sun


posted on Jan 16, 2025 11:06AM

కొత్త పరిశ్రమల ఏర్పాటు మాట అటుంచి రాష్ట్రం నుంచి ఉన్న పరిశ్రమలే తరలిపోయిన పరిస్థితి గత ఐదేళ్లలో జగన్ హయాంలో చూసిన ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు పరిశ్రమలు క్యూకడు తున్నా యి.ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు అత్యంత భద్రమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకుం టున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, ఆయన ప్రభుత్వ పారిశ్రామిక విధానం కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయి. అదే విధంగా కేంద్రం నుంచి రావలసిన ప్రాజెక్టులు కూడా ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే  కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు, శంకుస్థాపనలతో  రాష్ట్ర పారిశ్రామిక రంగం కొత్త ఉత్సాహంతో పరుగులు తీస్తున్నది. తాజాగా  ఆంధ్రప్రదేశ్‌కు మరో కీలక ప్రాజెక్టు రానుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది.

10 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్రంలో ఆసియాలోనే అతి పెద్ద  సౌర విద్యుత్ ప్లాంట్‌ ఏర్పాటుకు రిలయన్స్‌ ఎన్‌యూ సన్‌టెక్‌  ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టును కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న రిలయన్స్ ఎన్ యూ సన్ టెక్ ఇందు కోసం భూముల పరిశీలన చేస్తున్నది.  ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్ ఎన్‌యూ సన్‌టెక్ రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 930 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్లాంట్‌తో పాటు 465 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే వేయి మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. పరోక్షంగా మరో ఐదు వేల మందికి ఉపాధి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  

సెకితో కలిసి రిలయన్స్ ఎన్‌యూ సన్‌టెక్‌ చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా పాతికేళ్ల  కాలానికి విద్యుత్ కొనుగోలు చేసేలా సెకి ఒప్పందం చేసుకోనుంది.  రిలయన్స్ ఎన్‌యూ సన్‌టెక్‌ కర్నూలులో ఏర్పాటు చేసే ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయిన సోలార్ విద్యుత్‌ను దేశంలోని వివిధ విద్యుత్ పంపిణీ సంస్థలకు సరఫరా చేయనున్నారు. బిల్డ్‌ ఓన్‌ ఆపరేట్‌ -బీఓటీ విధానంలో ఈ సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు.