- అంతరిక్ష రంగంలో క్రమంగా పురోగతి సాధిస్తున్న స్పేస్‌ఎక్స్..
- స్పేస్‌ఎక్స్ ప్రయోగించిన రాకెట్ స్టార్ షిప్ విఫలం..
- రాకెట్ భూవాతావరణంలోకి ప్రవేశించగానే సాంకేతిక లోపాలతో పేలిపోయింది..

SpaceX Starship destroyed: అంతరిక్ష రంగంలో క్రమంగా పురోగతి సాధిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థకు కదుపుకు గురైంది. స్పేస్‌ఎక్స్ ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన పునర్వినియోగ భారీ రాకెట్ స్టార్‌షిప్ ఫెయిల్ అయింది. టెక్సాస్‌లోని బొకా చికా వేదిక నుంచి గురువారం నాడు ప్రయోగించారు. అయితే, రాకెట్ భూవాతావరణంలోకి ప్రవేశించగానే సాంకేతిక లోపాలతో ఒక్కసారిగా పేలింది. దీంతో శకలాలు కరేబియన్ సముద్రంలో పడగా.. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక, రాకెట్ పేలిపోవడంపై స్పేస్‌ఎక్స్ సంస్థ రియాక్ట్ అయింది. అయితే, ప్రయోగానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం సేకరించినట్లు సంస్థ యాజమాన్యం పేర్కొంది. ప్రయోగం విఫలమైనప్పటికీ ఇది స్టార్‌షిప్ విశ్వసనీయతను మరింత పెంచిందని చెప్పుకొచ్చారు. 232 అడుగుల భారీ రాకెట్ అయిన దీనిలో మొత్తం 33 రాప్టార్ ఇంజిన్లను ఉపయోగించారు.
Spectacular Disintegration of SpaceX’s Starship Over Turks and Caicos Islands!🌌🚀🇹🇨pic.twitter.com/JJ7XXbnqkN
— NeuroGizmo (@IaGadgets) January 17, 2025