Leading News Portal in Telugu

President Droupadi Murmu Honors Top Athletes with National Sports Awards


  • రాష్ట్రపతి భవన్‌లో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమం
  • ఘనంగా క్రీడాకారులకు పురస్కారాల ప్రదానం.
  • ముఖ్య అతిధిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
National Sports and Adventure Awards: 2024 ఏడాదికి గాను క్రీడాకారులకు పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి

National Sports and Adventure Awards: నేడు (జనవరి 17)న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇద్దరు ప్రముఖ క్రీడాకారులను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నతో సత్కరించారు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత షూటర్ మను భాకర్, యూత్ చెస్ ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్‌లను ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించారు. వీరితోపాటు పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ , పారా అథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్‌ లకు కూడా దేశంలోని అత్యున్నత క్రీడా గౌరవం లభించింది. ఈ వార్షిక గౌరవాలకు ఎంపిక పాయింట్ల విధానంపై ఆధారపడి ఉంటుంది. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పనితీరుపై గణనీయమైన ప్రాధాన్యతనిస్తుంది. ఈ కార్యక్రమం భారతీయ అథ్లెట్ల అద్భుతమైన ప్రతిభను, అంతర్జాతీయ వేదికపై వారి సహకారాన్ని హైలైట్ చేస్తుంది.

ఈసారి అర్జున అవార్డ్స్‌ (లైఫ్‌టైమ్‌) ను సుచా సింగ్‌ (అథ్లెటిక్స్‌), మురళీకాంత్‌ రాజారాం పెట్కర్‌ (పారా స్విమ్మింగ్‌) లను అందుకున్నారు. అలాగే ద్రోణాచార్య అవార్డులను (కోచ్‌లు) సుభాష్‌ రాణా (పారా షూటింగ్‌), దీపాలీ దేశ్‌పాండే (షూటింగ్‌), సందీప్‌ సంగ్వాన్‌ (హాకీ) లు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో లైఫ్‌టైం కేటగిరీలో మురళీధరన్‌ (బ్యాడ్మింటన్‌), అర్మాండో ఆగ్నెలో కొలాకో (ఫుట్‌బాల్‌) పురస్కారాలను అందుకున్నారు. వీరితోపాటు మరో 32 మంది అర్జున పురస్కారాలు అందుకున్నారు.

ప్రీతి పాల్‌ (పారా అథ్లెటిక్స్‌), అజీత్‌సింగ్‌ (పారా అథ్లెటిక్స్‌), సచిన్‌ సర్జేరావు ఖిలారి (పారా అథ్లెటిక్స్‌), ప్రణవ్‌ సూర్య (పారా అథ్లెటిక్స్‌), హెచ్‌. హోకాటో సీమ (పారా అథ్లెటిక్స్‌), తులసీమతి మురుగేశన్‌ (పారా బ్యాడ్మింటన్‌), అన్ను రాణి (అథ్లెటిక్స్‌), నీతూ (బాక్సింగ్‌), స్వీటీ బురా (బాక్సింగ్‌), వంతిక అగర్వాల్‌ (చెస్‌), సుఖ్‌జీత్‌ సింగ్‌ (హాకీ), స్వప్నిల్‌ సురేష్‌ కుసాలే (షూటింగ్‌), సరబ్‌జోత్‌ సింగ్‌ (షూటింగ్‌), అభయ్‌ సింగ్‌ (స్క్వాష్‌), సజన్‌ ప్రకాశ్‌ (స్విమ్మింగ్‌), అమన్‌ (రెజ్లింగ్‌), రాకేశ్‌ కుమార్‌ (పారా ఆర్చర్‌), సలీమా (హాకీ), అభిషేక్‌ (హాకీ), సంజయ్‌ (హాకీ), జర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (హాకీ), నిత్యశ్రీ సుమతి శివన్‌ (పారా బ్యాడ్మింటన్‌), మనీశా రాందాస్‌ (పారా బ్యాడ్మింటన్‌), కపిల్‌ పర్మార్‌ (పారా జూడో), మోనా అగర్వాల్‌ (పారా షూటింగ్‌), రుబినా ఫ్రాన్సిస్‌ (పారా షూటింగ్‌), సిమ్రాన్‌ (పారా అథ్లెటిక్స్‌), నవ్‌దీప్‌ (పారా అథ్లెటిక్స్‌), నితీశ్ కుమార్‌ (పారా బ్యాడ్మింటన్‌), సుచా సింగ్‌ (అథ్లెటిక్స్‌), మురళీకాంత్‌ రాజారాం పెట్కర్‌ (పారా స్విమ్మింగ్‌) లు అర్జున పురస్కారాలు అందుకున్నారు.